Friday, September 28, 2012

కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం!

పులి చర్మం.. ఖడ్గమృగం కొమ్ము.. ఏనుగు దంతం .. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం! జీవ వైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న సమస్య ఔషధాలు.. ఆభరణాలు.. దుస్తులు.. సౌందర్యసాధనాలు పలు వస్తువుల తయారీలో జంతువుల శరీర భాగాలు ఈ జీవి కొంచెం కొత్తగా... చాలా వింతగా ఉంది కదూ! దీని జీవితం మరింత చిత్రంగా ఉంటుంది. దీని పేరు సలామండర్. చూడటానికి బల్లిలా ఉంటుంది. నేలమీద, నీటిలోనూ జీవిస్తుంది. అంతేకాదు... నిప్పుల్లో కూడా బతుకుతుందని కొందరి నమ్మకం. మామూలు బల్లి తోక పెళుసుగా ఉండి.. ముట్టుకోగానే తెగిపోతుంది.
అలాగే.. సలామండర్ నాలుగు కాళ్లు కూడా చాలా పెళుసుగా ఉంటాయి. చటుక్కున తెగిపోతాయి. అంతేకాదు.. అవి మళ్లీ పెరుగుతాయి కూడా. ఈ ఫొటోలోని జీవి ఎడమ కాలు కూడా ఇలాగే తెగిపోయి.. మళ్లీ పెరుగుతోంది. ఇలా శరీర అవయవాలను తిరిగి పెంచుకునే శక్తి ఉండే అతి తక్కువ జీవుల్లో సలామండర్ ఒకటి. 'పాతాళ భైరవి'లో సంజీవని మూలికలా.. ఇందులో ఏ మాయ ఉందో! దీనిని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. రూ.518828400000 రూ.యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల ఎనభైనాలుగు లక్షలు!! ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జంతువుల అక్రమ రవాణా విలువ ఇది. ప్రపంచంలో దీనికన్నా ఎక్కువ విలువైన అక్రమరవాణాలు రెండే. అవి.. ఒకటి- ఆయుధాల స్మగ్లింగ్, రెండు- ఔషధాల అక్రమ రవాణా. అడవుల నరికివేత, అడవుల్లో జనావాసాలు పెరగడంతో జీవ వైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించిన అతిపెద్ద సమస్య ఇది.
అంతర్జాతీయ ఒప్పందాలు.. పోలీసు నిఘా.. స్వచ్ఛంద సంస్థల అవగాహన కార్యక్రమాలు.. ఇలా ఎన్ని ఉన్నా జంతుజాతి అంతరించే ముప్పును మరింత వేగవంతం చేస్తున్న ఈ అక్రమరవాణా ఏటికేడాదీ పెరుగుతూనే ఉంది. వందేళ్ల క్రితం.. ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న పులుల సంఖ్య 2010 నాటికి 3200కు పడిపోవడమే ఇందుకు ప్రబల నిదర్శనం. పులుల తర్వాత అత్యంత తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నవి ఏనుగులు. దంతాల కోసం ఇప్పటికీ ఏటా 20 వేల ఏనుగుల్ని హతమారుస్తున్నారు. ఇంకా.. ఖడ్గమృగాలు, సముద్ర తాబేళ్లు, సింహాలు వేటగాళ్లకు బలైపోతున్నాయి. వియత్నాంలో గత నాలుగు దశాబ్దాల్లో 12 రకాల జీవజాతులు అంతరించిపోయాయి. జంతువుల అక్రమరవాణాలో మరొక వికృతపార్శ్వం.. మానవ హత్యలు. తమకు అడ్డొచ్చే అధికారులను, అడవుల్లో వేటాడేటప్పుడు అడ్డుకునే స్థానిక గిరిజనులను వేటగాళ్లు అన్యాయంగా పొట్టనబెట్టుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ గణాంకాల ప్రకారం.. ఏటా 100కు పైగా ఆఫ్రికన్ అటవీ రేంజర్లు జంతువుల స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని అంచనా.
ఎందుకు? బెల్టులు.. చెప్పులు.. ఆభరణాలు.. అలంకరణవస్తువులు.. సౌందర్యసాధనాలు.. ఔషధాలు.. ఆహారపదార్థాలు.. ఇలా పలురకాల వస్తువుల తయారీలో జంతువుల అవయవాలను వినియోగిస్తున్నారు. "ఖడ్గమృగం కొమ్ముకు కేన్సర్‌ను తగ్గించే లక్షణం ఉందని ఆఫ్రికా దేశాలవారు నమ్ముతారు. ఆ కొమ్ముతో తయారుచేసిన కప్పు తో మంచినీళ్లు, కాఫీ, టీ తాగితే ఆనందంగా ఉంటామని మరికొందరు విశ్వసిస్తారు'' అని స్వీడన్‌కు చెందిన నేషనల్ పోలీస్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ క్రైమ్ బృంద నాయకుడు లిండా అర్రోయో చెబుతారు. 2009 నాటి లెక్కల ప్రకారం ఖడ్గమృగం కొమ్ము ల ధర కిలోకు దాదాపుగా రూ.20 లక్షలు. ఇప్పటి లెక్కల ప్రకారమైతే రూ.35 లక్షల పైమాటే ఉండొచ్చని అంచనా.
+ పులి/చిరుతపులి ఎముకలు, గోళ్లు, పురుషాంగాలకు ఆసియాలోని పలు దేశాల్లో బాగా గిరాకీ ఉంది. బర్మాలోని మోంగ్‌లా అనే ఉత్తరాది రాష్ట్రంలో శృంగార పరిశ్రమ మొత్తం వీటిచుట్టూనే తిరుగుతోందంటే అతిశయోక్తి కాదు. బాగా ఎదిగిన పులి చర్మానికి అక్రమ మార్కెట్లో రూ.18 లక్షల ధర పలుకుతుందని అంచనా. +పులి ఎముకల పొడి నుంచి తయారుచేసే జిగురును ఒక పౌండుకు (453 గ్రాములు) రూ.లక్షకు పైగా వెచ్చించి కొనేవారున్నారు. +వన్యప్రాణుల స్వచ్ఛంద సంస్థ 'ట్రాఫిక్' గణాంకాల ప్రకారం.. 'పులి ఎముకల వైన్'ను ఒక్కో సీసా రూ.2000 నుంచి రూ.5 వేల దాకా అమ్ముతారు. చైనీయులు వీటిని సీసాల కొద్దీ కొని సేవిస్తారు. + ఎలుగుబంటి శరీరంలో విడుదలయ్యే పైత్యరసాన్ని చైనా సంప్రదాయ వైద్యంలో రకరకాల మందుల తయారీలో వినియోగిస్తారు. + టిబెట్‌లో కనిపించే శాటూష్ రకం జింక ఉన్నితో తయారుచేసే ఒక్కో శాలువాకు నాణ్యతను బట్టి రూ.65 వేల నుంచి రూ.ఆరున్నర లక్షల దాకా పలుకుతుంది. + ఎలిఫెంట్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లెక్కల ప్రకారం.. 1989-2009 మధ్య ఒక్క డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే అక్రమంగా రవాణా అవుతున్న 15,562 కిలోల ఏనుగు దంతాలను అధికారులు పట్టుకున్నారు. ఇదే సమయంలో టాంజానియాలో సీజ్ చేసిన ఏనుగు దంతాలు.. అక్షరాలా 76, 293 కిలోలు!. జంతువుల పాలిట యముడు ప్రపంచంలోని జీవజాతుల పాలిట కాలయముడిగా పేరొందిన జంతువుల అక్రమ రవాణా దారు ఒకడున్నాడు. అతడే.. యాన్సన్ వాంగ్!! ఈ పేరు వింటేనే అమెరికా, కెనడా, న్యూజిలాండ్ ఇలా దాదాపు 12కు పైగా దేశాల పోలీసులు అప్రమత్తమైపోతారు! పక్షులు, బల్లులు, పాములు, పులులు, సింహాలు.. కోరుకున్నవారికి కోరుకున్న జీవిని సరఫరా చేస్తాడు!! అతడు అక్రమంగా సరఫరా చేయలేని జీవే లేదంటే అతిశయోక్తి కాదు. మలేసియాకు చెందిన వాంగ్‌కు చట్టబద్ధంగా జంతువులను రవాణా చేసే వ్యాపారం ఉంది. కానీ, చట్టబద్ధంగా కంటే అతడు అక్రమంగా రవాణా చేసే జంతువుల సంఖ్యే ఎక్కువ. లిజార్డ్ కింగ్.. ద కింగ్ పిన్.. ఇవీ యాన్సన్‌వాంగ్‌కు మీడియా ఇచ్చిన బిరుదులు. 1998లో.. నిషేధిత జీవాలతో మెక్సికో సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన ఇతణ్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అతడికి 71 నెలల జైలు, దాదాపు రూ.32 లక్షల జరిమానా విధించింది. అతడు జైల్లో ఉండగానే.. అతడి భార్య మరో కొత్త కంపెనీ పెట్టి వ్యాపారాన్ని కొనసాగించడం మొదలుపెట్టింది. అదీ యాన్సన్‌వాంగ్ సత్తా. ఎన్నిసార్లు అరెస్టయినా.. జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి పలు దేశాల్లో చట్టాలు బలంగా లేకపోవడంతో ఆ లొసుగులను ఉపయోగించి బయటపడ్డం.. కుదరకపోతే కొన్నాళ్లు జైల్లో గడిపి మళ్లీ బయటికొచ్చేయడం అతడికి అలవాటు. ఏనుగుల పాలిట క్రూరప్పన్ మనదేశంలో ఏనుగుల పాలిట యముడు.. వీరప్పన్. తన జీవితకాలంలో 200 ఏనుగులను చంపి రూ.13 కోట్ల విలువల చేసే దంతాలను అక్రమంగా దేశం దాటించాడు. 10 వేల టన్నుల చందనం చెట్లను కొల్లగొట్టాడు. వీటి విలువ అప్పట్లోనే దాదాపుగా రూ.117 కోట్లు ఉంటుందని అంచనా. 2004లో వీరప్పన్ చనిపోయాకే ఈ దారుణాలకు బ్రేక్ పడింది.
రూ.40 లక్షల చిలక అమెజాన్ బేసిన్, ఆగ్నేయాసియా దేశాల్లో కనిపించే పలురకాల పక్షిజాతులకు అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక ధర పలుకుతుంది. ఉదాహరణకు.. బ్రెజిల్‌లో కనిపించే లియర్స్ మకావు అనే ఈ రామచిలుక (సముద్ర నీలం రంగులో ఉంటుంది) బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముడయ్యే అత్యంత లాభసాటి పక్షుల్లో ఒకటి. 2008 నాటి లెక్కల ప్రకారం.. ఒక్కో పక్షికీ బ్లాక్ మార్కెట్లో దాదాపుగా రూ.40 లక్షలు పలికేది. ప్రస్తుతం ప్రపంచంలో ఈ జాతి రామచిలుకలు కేవలం 960 మాత్రమే ఉన్నాయని అంచనా.

No comments: