Friday, September 28, 2012

అంతా 'జన్యు మాయ'

అంతా 'జన్యు మాయ' కంపెనీల కాసుల వేట.. అధిక దిగుబడి రాదు!.. చీడల పీడ వదలదు జన్యుమార్పిడితో కీడే ఎక్కువ.. సంప్రదాయ పంటలే మేలు.. శాస్త్రవేత్తల ఉమ్మడి అభిప్రాయం అబ్బ... ఎంత చూడ ముచ్చటగా ఉన్నాయో! ఎవరో అతిథి కోసం మోరలు చాచి ఎదురు చూస్తున్నట్లుంది కదూ! ఇవి ఫ్లెమింగో పక్షులు. వందల సంఖ్యలో ఒకేచోట గుమికూడతాయి! పింక్ రంగులో అందరినీ మురిపిస్తాయి. ఫ్లెమింగోలలో ఆరు రకాలు ఉన్నాయి. అలాగని ఇవన్నీ పింక్ రంగులో ఉండవు. పిల్ల ఫ్లెమింగోలు లేత బూడిద రంగులో ఉంటాయి. అవి తీసుకునే ఆహారాన్ని బట్టి... వాటి ఈకల రంగు మారుతుంది. ఒక రకమైన నాచులోని కెరోటినాయిడ్స్ అనే పదార్థంవల్ల వీటికి పింక్ రంగు వస్తుందని గుర్తించారు. కెరోటినాయిడ్స్ ఉన్న నాచు దొరకకపోతే... ఇవి కూడా కొంగల్లా తెల్లగానో, బూడిద రంగులోనే ఉంటాయి.
జన్యు మార్పిడి పంటలు! పెరుగుతున్న జనాభా ఆహార అవసరా లు తీర్చేందుకు ఇవే శరణ్యమా? వీటివల్ల నిజంగా రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందా? బీటీ వల్ల మేలే జరుగుతుందని కొం దరు అంటారు. 'కాదు కీడు' అని మరికొందరు చెబుతారు. రైతు లు ఎవరిని నమ్మాలి! అయితే.. 400 మంది శాస్త్రవేత్తలు సుమారు పదేళ్లపాటు సంయుక్తంగా ఒక పరిశోధన చేసి- జన్యుమార్పిడి పంటలవల్ల లాభం లేదని తేల్చారు. ఈ పరిశోధనల్లో కీలకమైన పాత్ర పోషించిన ప్రపంచ ఆహార సంస్థ బహుమతి గ్రహీత, యూఎన్ ఇంటర్నేషనల్ అసెస్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ నాలెడ్జి అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ (ఐఏఏఎస్‌టీడీ) చైర్మన్ ప్రొఫెసర్ హ్యాన్స్ హరీన్, మ్యాండ్‌మిన్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ వాల్టర్ గోల్డ్‌స్టిన్, అమెరికా స్వచ్ఛంద సంస్థ యూనియన్ ఆఫ్ కన్సర్న్ సైంటి స్ట్స్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న డగ్ గురియన్ షర్మన్, బీటీ వంగపై పరిశోధన చేసిన ప్రొఫెసర్ జాక్ హినీమెన్ జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. తారా ఫౌండేష న్ ఆధ్వర్యంలో 'జన్యుమార్పిడి పంటలు-భారతదేశ ఆహార భద్రత' అంశంపై గురువారం జరిగిన ఒక సదస్సులో పాల్గొన్నారు. జన్యు మార్పిడి పంటలకన్నా సంప్రదాయ పంటలే మిన్న అని వారు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ఈ అంశాలపై 'ఆన్‌లైన్' ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలివి... ఇది బ్యాండ్ ఎయిడ్ వంటిది! ప్రొఫెసర్ హ్యాన్స్ హరీన్ ఆహార భద్రత, జీవ భద్రత అనే సవాళ్లకు జన్యు మార్పిడి పంటలతో సమాధానం లభిస్తుందా? జన్యు మార్పిడి పంటలతో తాత్కాలికంగా దిగుబడి పెరిగినట్లు కనిపిస్తుంది. ఇది దెబ్బతగిలిన వెంటనే ప్రథ మ చికిత్స కోసం తగిలించుకునే బ్యాండ్ ఎయిడ్ లాంటిది. అంతేతప్ప... శాశ్వ త పరిష్కారం కాదు. జన్యు మార్పిడి పంటలవల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువ ఉదాహరణకు... జీఎం పంటలను అందరి కన్నా ముందు ప్రవేశపెట్టిన అమెరికాలో తొలుత దిగుబడి బాగా పెరిగిందని ఆనందించారు. కానీ... గత 12 ఏళ్లలో అమెరికాలో పెరిగిన మొక్కజొన్న, సోయాబీన్ దిగుబడులకు జన్యు మార్పిడి పంటలు కారణం కాదని తేలింది. సంప్రదాయ పద్ధతుల్లో పంటలను బ్రీడ్ చేయటం, ఉత్పత్తి విధానాలు మెరుగుపరచడం వల్లే ఇది సాధ్యమైనట్లు స్పష్టమైంది. జీవ భద్రత విషయానికి వస్తే.. జీఎం పంటలతో ఎవరికీ లొంగని చీడపీడలు ఆవిర్భవిస్తున్నాయి. అమెరికాలో కలవరపెడుతున్న 'సూపర్ వీడ్' ఇలాంటిదే. జీఎం విత్తన కంపెనీలు ఈ వాస్తవాలను అంగీకరించవు. జీఎం పంటల విషయంలో భారత్ వంటి దేశాలు ఏ వ్యూహాన్ని అనుసరించాలి? భారత ప్రభుత్వం వ్యవసాయపరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృ ష్టి పెట్టాలి. ఉన్న వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోడానికి సిద్ధం కావాలి. సంప్రదాయ పంటలు, వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. భారత్‌కు సంబంధించి అదే మంచి వ్యూహం. ఇం'ధనమే' పరమార్థం! వాల్టర్ గోల్డ్‌స్టెన్ అమెరికాలో మొక్కజొన్నపై రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు కదా! మీరు ఏం గుర్తించారు? జన్యు మార్పిడి మొక్కజొన్నలో ప్రొటీన్లు తగ్గిపోతూ వస్తున్నాయి. పిండిపదార్థం శాతం పెరుగుతోంది. జీవ ఇం ధనమైన ఇథనాల్ తయారీలో మొక్కజొన్నను ఉపయోగిస్తారు. అందులో ఎంత ఎక్కువ పిండిపదార్థం ఉంటే అంత ఎక్కువ ఇథనాల్ తయారవుతుంది. అంటే... అమెరికాలో జీఎం మొక్కజొన్న సాగు వెనకున్న అసలు లక్ష్యం ఇథనాల్ తయా రీ. అంతే తప్ప ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడం కాదు. ఇక... ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రకరకాల ఆహార పంటలపై ప్రయోగాలు చేసే రైతులు తగ్గిపోయి, ప్రయోగశాలల్లో జన్యువులపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల సంఖ్య పెరిగిపోయింది. దీనివల్ల వ్యవసాయ పద్ధతులపై కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం పెరిగిపోతోంది. సంప్రదాయ పద్ధతులలో వ్యవసాయం చేయనివ్వకుండా ఈ కంపెనీలు అడ్డుకుంటున్నాయి. మీ దేశంలో ఇదే పరిస్థితి ఉందనుకుంటా! దీనికి ప్రత్యామ్నాయాలేమిటి? ప్రకృతి మనకు అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఇచ్చింది. వాటిని గుర్తించగలిగితే చాలు. కరువును తట్టుకొనే జీఎం విత్తనాలను తయారు చేశామని కంపెనీలు చెబుతున్నాయి. కానీ, అవి మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నాయి. అలా కాకుండా అర్జెంటీనాలో ఒక ప్రాంతంలో పండించే మొక్కజొన్న- ఎలాంటి కరువు పరిస్థితులనైనా తట్టుకొని నిలబడుతుంది. దీనిని అభివృద్ధి చేయటానికి ప్రయత్నిస్తున్నాం. లాబీయింగ్‌కు దాసోహం! డాక్టర్ డౌగ్ గురియన్ షుర్‌మెన్ ప్రపంచవ్యాప్తంగా జన్యు మార్పిడి పంటల విస్తృతి ఎలా ఉంది? అమెరికా, అర్జెంటీనా, పెరుగ్వేలలో మాత్ర మే జన్యుమార్పిడి పంటలు ఎక్కువ శాతం ఉన్నాయి. మిగిలిన కొన్ని దేశాల్లో వీటిని ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. అమెరికాలో మొత్తం సాగు లో 30 శాతం మాత్రమే జన్యు మార్పిడి పంటలను వేశారు. జన్యు మార్పిడి పంటలకు, ఇతర పంటలకు మధ్య దిగుబడులలో పెద్ద తేడా లేదని అధ్యయనా లు చెబుతున్నాయి. ఇక అర్జెంటీనా, పెరుగ్వేలలో- జన్యు మార్పిడి పంటలు 30 శాతం ఉన్నప్పడు దిగుబడులు ఎక్కువగానే కనిపించాయి. అది 40 శాతానికి చేరిన తర్వాత దిగుబడులు తగ్గిపోతూ వచ్చా యి. అంటే.. అధిక దిగుబడులకు జీఎం పంటలు ప్రత్యామ్నాయం కాదని స్పష్టమవుతోంది. దిగుబడులు పెరగవు. చీడపీడలు ఆగవు. అయినా.. అనేక దేశాల్లో వీటిని ప్రవేశపెడుతూనే ఉన్నారు. దీనికి కారణమేమిటి? ప్రపంచవ్యాప్తంగా ఐదు కంపెనీలు జ న్యు మార్పిడి విత్తనాల మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇవి ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా తమ విత్తనాలను కొత్త మార్కెట్లలో ప్రవేశపెడుతూ ఉంటాయి. ఒక్కసారి ఈ విత్తనాలు ప్రవేశిస్తే- వాటి నే ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదాహరణకు భారత్‌నే తీసుకుందాం. నా వద్ద ఉన్న గణాంకాల ప్రకారం- బీటీ విత్తనాల మార్కెట్‌లో 90 శా తం మోన్‌శాంటో చేతిలో ఉంది. బలమైన మార్కెట్లు చేతిలో ఉండటం వల్ల వీటి ఆదా యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అం దువల్ల వారు లాబీయింగ్ కోసం భారీ స్థాయి లో ఖర్చు పెడతారు. అమెరికాలో లాబీయిం గ్ చట్టబద్ధమైన అంశం. ఒక్క మోన్‌శాంటో కంపెనీయే లాబీయింగ్ కోసం 7 నుంచి 10 కోట్ల డాలర్ల వరకూ ఖర్చు పెడుతున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ కంపెనీల లాబీయింగ్ చాలా బలంగా ఉంటుంది. అందువల్ల జన్యు మార్పిడి పంటలతో ప్రయోజనం లేదని తేలినా ప్రభుత్వాలు వీటికి అనుమతి ఇస్తూనే ఉంటాయి. జన్యుమార్పిడి మొక్కజొన్నతో రొమ్ము క్యాన్సర్! దిగుమతిపై రష్యా నిషేధం న్యూయార్క్, సెప్టెంబర్ 27: అమెరికన్ మొక్కజొన్నపై రష్యా వేటు వేసింది. జన్యు మార్పిడి (జీఎం) విధానంలో రూపొందించిన మొక్కజొన్నతో క్యాన్సర్ సోకే ప్రమాదం అధికమవుతుందంటూ అధ్యయనంలో నిర్ధారణ కావడమే దీనికి కారణం. మోన్‌శాంటో కంపెనీ సృష్టించిన ఎన్‌కే603, రౌండప్ అనే అమెరికన్ జీఎం మొక్కజొన్నతో రొమ్ము క్యాన్సర్‌తోపాటు, పలు అవయవాలు దెబ్బతినే ప్రమాదముందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గతంలో... బయోటెక్ కంపెనీలు కేవలం 90 రోజులపాటు ఎలుకలకు అమెరికన్ జీఎం కార్న్ తినిపించి... ఇవి చాలా సురక్షితం అని తేల్చారు. ఇప్పుడు... అదే జీఎం కార్న్-ఎలుకల ప్రయోగాన్ని న్యూజెర్సీలోని కీన్ యూనివర్సిటీ నిపుణులు రెండేళ్లుగా చేస్తున్నారు. ఈ పరిశోధనల ఫలితాలను ఇతర నిపుణులు కూడా పరీక్షించారు. ఈ మొక్కజొన్నతో క్యాన్సర్ ప్రమాదం అధికమవుతుందని తేల్చి చెప్పారు. దీంతో... అమెరికన్ జీఎం మొక్కజొన్న గుర్తింపును రష్యా రద్దు చేసింది. ఈ మొక్కజొన్న దిగుమతిపై నిషేధం విధించింది. మరికొన్ని దేశాలు కూడ రష్యా మార్గంలోనే ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమ్మో దోమ! భూమిపై ప్రస్తుతం ఎక్కువ మందిని బలి తీసుకుంటున్న జీవి ఏదో తెలుసా! పులి, సిం హం వంటి క్రూరమృగాలు గుర్తుకొస్తున్నాయా? అవేమీ కాదు..! గాలికి కొట్టుకుపోయే బుల్లి ప్రాణి దోమ! జీవ వైవిధ్యం దెబ్బతింటే ఎంతటి చేటు కలుగుతుందో చెప్పడానికి దోమలే ప్రత్యక్ష ఉదాహరణ! దోమలను తినే కప్పలు, గబ్బిలాలు, కొన్ని రకాల తూనీగలు వంటి జీవులు క్రమంగా అంతరించాయి. మనుగడ కోసం పోరాటం అనే జీవన చక్రంలో గొలుసు బంధం తెగిపోయింది. దీంతో దోమల సంతతి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడా చిన్ని జీవి అత్యంత ప్రమాదకారిగా మారింది. దొరికినప్పుడల్లా మనిషి రక్తం పీల్చుతూ వ్యాధులను వ్యాపింప చేస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 70కోట్ల మంది అనేక రోగాల బారిన పడుతున్నారు. వారిలో కనీసం 30లక్షల మంది చనిపోతున్నారని ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహిం చిన అధ్యయనంలో తేలింది.

No comments: