Tuesday, November 29, 2011

భారతదేశం - అణుశక్తి రంగంలో ప్రగతి

భారతదేశం - అణుశక్తి రంగంలో ప్రగతి

అణుశక్తి రంగంలో స్వయం సంమృద్ధిని సాధించడానికి భారత్ మూడంచెల విధానాన్ని అవలంభిస్తోది
1940లో భారతదేశంలో అణుశక్తి కార్యక్రమాల రూపకల్పన ప్రారంభమయ్యింది. అప్పటికే దేశంలో విస్తారంగా లభిస్తున్న యురేనియం, థోరియం నిల్వలను సమర్థవంతంగా ఉపయోగించుకొనేందుకు వీలుగా మూడు దశల అణుశక్తి సాధన కార్య్రకమాన్ని మన శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • మొదటి దశ :

    ఈ దశలో సహజ యురేనియంను పీడన భార జల రియాక్టర్ల ద్వారా మండించిన శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియల్లో ప్లూటోనియం ఉత్పత్తిగా ఏర్పడుతుంది.
  • రెండవ దశ:

    ఈ దశలో మొదటి దశలో ఉత్పత్తి అయిన ప్లూటోనియం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో చర్య జరిగి శక్తి (విద్యుత్)తో పాటు ఉప ఉత్పత్తిగా థోరియం నుంచి యురేనియం -233 ఉత్పత్తి అవుతుంది.
  • మూడవ దశ:

    ఈ దశలో కార్యక్రమం సంక్లిష్టతను సంతరించుకొంటుంది. థోరియం నుండి గణనీయ పరిమాణంలో యు-233- ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మొదటి దశ వాణిజ్య ఉత్పత్తి స్థాయికి చేరింది. ఒక రెండో దశ కల్పక్కంలోని ఫాస్ట్ బ్రీడర్ టెస్ట రియాక్టర (ఎఫ్ బి టిఆర్) విజయవంతం కావడంతో మొదలయ్యింది. యురేనియం -233 ఇంధనం కూడా వెలికి తీయడంతో మూడో దశకు అంకురార్పణ జరిగినట్లయింది.
మొదటి దశలో ఉపయోగించే అధిక పీడన భారజల కర్మాగారం, నమూనా నిర్మానం, పనిచేయించడంలో భాతర దేశం పూర్తి సాంకేతిక సామర్ధ్యాన్ని సాధించింది. అలాగే అణుశక్తి వెలికితీత చక్రంలోన ఎక్సఫ్లోరేషన్, మైనింగ్, ప్యూయల్, ఫ్యాబ్రికేషన్, డిజైనింగ్ తో పాటు న్యూక్లియర్ పవర్ రియాక్టర్ నిర్మాణము, నిర్వహణ సామర్ధ్యాలలో భారత శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. భారత దేశంలోని ఫాస్ట్ బ్రీడర్ రీసెర్చ్ రియాక్టర్ల కోసం తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేస్తుంది.

అణు విద్యుత్ కేంద్రాలు

భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాల నమూన, రూపకల్పన, నిర్మాణం, నియంత్రణ వంటి కార్యకలాపాలను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నిర్వహిస్తుంది.
1969లో తారాపూర్ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ (TAPS)తో భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి అంకురార్పణ జరిగింది. రెండు 210మె.వా. ఉత్పాదన సామర్ధ్యం కలిగిన యూనిట్లు ఉన్నాయి. దీనిలో ఇంధనంగా ఎన్ రిచ్ డ్ యురేనియం (LUE)తో పాటు యురేనియం ప్లూటోనియం ఆక్సెడ్లు (MOY) మిశ్రమాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇటీవల ఈ కేంద్రానికి చైనా నుండి లో ఎన్ రీ చ్ డ్ యురేనియం సరఫరా జరుగుతున్నది.
రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం(RAPS) : రవత్ భాటలో ఈ అణు విద్యుత్ కేంద్రం స్థాపించారు. ఇందులో రెండు ప్రొటోటైప్ పిఎచ్ డబ్ల్యుఆర 220 మె.వా. సామర్ధ్యం కలిగిన యూనిట్లు ఉన్నాయి. ఈ కేంద్రంలో ఇందనంగా సహజ యురేనియంను వాడుతారు. ఈ రెండు యూనిట్లు 1972. 1981లో క్రిటికాలిటిని సాధించాయి. మూడవ, నాల్గవ యూనిట్లలలో ప్రేసరైజ్ డ్ హేవీ వాటర్ రియాక్టర్ లను ఉపయోగిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రేసరైజ్ డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఉపయోగించిన దేశంలోని మొదటి అణు విద్యుత్ కేంద్రం.
కల్పకంలోని మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం 1984లో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. ఇక్కడ ఉపయోగించిన పి.ఎచ్.డబ్ల్యు.ఆర్. రియాక్టర్లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ విద్యుత్ కేంద్రాలనుండి చెన్నై నగరానికి విద్యుత్ సరఫరా జరుగుతుంది.
నరొరా అణు విద్యుత్ కేంద్రం, విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం220మె.వా. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలకు ఈ కేంద్రం నుండి విద్యుత్ సరఫరా జరుగుతుంది.
కక్రాపార అణు విద్యుత్ కేంద్రం 220 మె.వా. సామర్ధ్యం కలిగి ఉంది. దీనితో భారతదేశంలో మొత్తం అణు విద్యుత్ స్థాపన 1720 మె.వా.కు పెరిగింది.

అణుశక్తి పరిశోధన - అభివృద్ధి

భారతదేశంలో అణుశక్తి పరిశోధనలు ముఖ్యంగా ట్రాంబేలోని బాబా అటామిక్ రీసెర్చ సెంటర్(BARC) కల్పకంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసర్ ్చ (IGCAR) ఇండోర్లోని సెంటర్ఫర అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోల్కతాలోని వేరియడా ఎనర్జీ క్లైక్లోట్రాన్ సెంటర్లో జరుగుతున్నాయి. బాబా అణు పరిశోధనా కేంద్రాన్ని (BARC)ను 1957లో నెలకొల్పొనారు. ఇది భారతదేశ అణుశక్తి పరిశోధనకు కీలకమైంది.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నెలకొల్పొన ఒక మె.వా. సామర్థ్యం కలిగిన మొదటి భారతీయ పరిశోధన రియాక్టర్ అస్పర.40 మె.వా. సామర్ధ్యం కలిగిన సైరస్ (CIRUS) రియాక్టర్ 1960 నుండి చేయ... ప్రారంభించింది. పూర్ణిమ 2 యు-233 ఇంధనాన్ని ఉపయోగించిన రాయాక్టరు. 1985లో పని చేయడం ప్రారంభించిన ధృవ. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 100 మె.వా. సామర్ధ్యం గల రియాక్టరు. కల్పకంలోని కామిని రియాక్టర్ న్యూట్రాన్ ఇంధన ఆథారితమైనది.

No comments: